మోటొరోలా తన తాజా ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘Moto Pad 70 Pro’ పేరుతో తీసుకొచ్చిన ఈ డివైస్ ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.
ఈ ట్యాబ్లెట్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్‌ను అందించారు. 10,200mAh భారీ బ్యాటరీతో పాటు 45W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్ లభించనుంది.
డిస్‌ప్లే విషయానికి వస్తే 13 అంగుళాల 3.5K LCD స్క్రీన్‌ను అందించారు. 144Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో విజువల్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేస్తుంది. హలో UIతో పాటు రెండేళ్ల OS అప్‌డేట్స్, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను కంపెనీ హామీ ఇచ్చింది.
ఏఐ ఆధారిత ఫీచర్లలో AI రీడర్, AI నోట్స్, స్మార్ట్ క్యాప్చర్, AI లైవ్ ట్రాన్స్‌క్రిప్ట్ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. కెమెరా పరంగా వెనుక 13MP, ముందు 8MP సెల్ఫీ కెమెరాలు అందించారు.
కనెక్టివిటీ విషయంలో డాల్బీ అట్మాస్ సౌండ్, WiFi 7, Bluetooth 6.0, USB Type-C వంటి ఫీచర్లు ఉన్నాయి. 589 గ్రాముల బరువుతో పాంటోన్ టైటాన్ కలర్‌లో లభిస్తుంది. స్టోరేజ్‌ను మైక్రో SD కార్డు ద్వారా 2TB వరకు పెంచుకోవచ్చు.
మోటో పెన్ ప్రో కూడా బాక్స్‌లో అందిస్తున్నారు, ఇది డిజైనింగ్, ప్రెజెంటేషన్స్, బిజినెస్ పనులకు ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
ధర విషయానికి వస్తే 8GB + 128GB వేరియంట్ ధర రూ.36,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. కీబోర్డ్ ఆఫర్‌తో టాప్ వేరియంట్ ధర రూ.45,999గా నిర్ణయించారు. ICICI బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు రూ.4,000 వరకు డిస్కౌంట్ లభించనుంది. జులై 4 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరొలా ఇండియా వెబ్‌సైట్‌తో పాటు రిటైల్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















