ఇంటర్నెట్ డెస్క్ – చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు శుభవార్త. ఐపీఎల్‌లో మేటి జట్లలో ఒకటిగా నిలిచిన సీఎస్కే, వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లోకి అడుగుపెట్టే యోచనలో ఉందని ఫ్రాంఛైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ వెల్లడించారు.
‘ఇన్వెస్ట్ ఇన్ తమిళనాడు’ సదస్సులో మాట్లాడిన ఆయన, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి రాదని, కానీ ఇది సీఎస్కే భవిష్యత్తు కార్యాచరణలో భాగమని స్పష్టం చేశారు.
“ఇప్పటికిప్పుడు కాదు కానీ, కచ్చితంగా త్వరలోనే సీఎస్కేను విస్తరిస్తాం. ముందుగా మహిళల క్రికెట్‌లో అడుగు పెట్టబోతున్నాం. ఇతర క్రీడల్లోనూ మా ప్రస్థానం ఉంటుంది” అని కాశీ విశ్వనాథన్ తెలిపారు.
ప్రస్తుతం డబ్ల్యూపీఎల్‌లో ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఫ్రాంఛైజీలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఐపీఎల్‌లో సత్తా చాటిన చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి జట్లు ఇంకా డబ్ల్యూపీఎల్‌లోకి రాలేదు.
ఇక డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఫిబ్రవరి 5న తుదిపోరు జరగనుండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుండగా, గెలిచిన జట్టు ఫైనల్లో ఆర్సీబీతో తలపడనుంది.
సీఎస్కే డబ్ల్యూపీఎల్‌లోకి వస్తే, మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ పెరగడమే కాకుండా లీగ్‌కు కొత్త ఉత్సాహం రానుందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















