యడ్లపాడు – వైకాపా నేత, మాజీ మంత్రి విడదల రజనిపై యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 30న విడదల రజని అనుచరులు, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఈ కేసు నమోదు అయింది.
టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, విడదల రజనితో పాటు మొత్తం 21 మంది వైకాపా నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ రోజు చోటుచేసుకున్న ఘర్షణలో పరస్పర ఆరోపణలు, తోపులాటలు జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం.
ఘటనకు సంబంధించి సాక్ష్యాలు, వీడియో ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుపై మరింత విచారణ కొనసాగుతోందని, అవసరమైతే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















