కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. 54 మంది ప్రయాణికులతో హుస్నాబాద్ నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిని ఢీకొట్టింది. అయితే బస్సు బావిలో పడకుండా అంచునే ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్‌కు బయలుదేరింది. సుందరగిరి గ్రామ సమీపంలో రోడ్డు వెడల్పు పనులు జరుగుతుండటంతో రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతల మధ్య నుంచి బస్సు వెళ్తుండగా ఒక్కసారిగా స్టీరింగ్ కంట్రోల్ లింక్ ఊడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
దీంతో అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావి వైపు దూసుకెళ్లి, బావికి అమర్చిన సిమెంటు రింగులను ఢీకొట్టింది. అనంతరం బావి అంచునే ఆగిపోయింది. బస్సు బావిలోకి దూసుకెళ్లి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు.
ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం క్రేన్ సాయంతో బస్సును అక్కడి నుంచి పక్కకు తరలించారు.
డ్రైవర్ హరీశ్ అజాగ్రత్తగా, రాంగ్ రూట్‌లో బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానిక ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

















