తాను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నప్పటికీ తన మనసంతా ‘పెద్ది’ దగ్గరే ఉందని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ (Peddi) నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని సొంతం చేసుకోవడంతో, ఒక తండ్రిగా, ఒక నటుడిగా తనకెంతో గర్వంగా ఉందంటూ చిరంజీవి భావోద్వేగ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందాన్ని ఆయన హృదయపూర్వకంగా అభినందించారు.
‘‘నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా ‘పెద్ది’ దగ్గరే ఉంది. గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టం, పెట్టిన శ్రద్ధాసక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను. ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది. ‘పెద్ది’ పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయతీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం’’ అని చిరంజీవి పేర్కొన్నారు.
రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తూ, ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. ‘‘ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబుకు ప్రత్యేక అభినందనలు. అలాగే తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత వెంకట సతీశ్ కిలారుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు శివరాజ్ కుమార్, అప్పలసూరి పాత్రలో జీవించిన జగపతిబాబు, అలాగే జాన్వీ కపూర్, దివ్యేందు సహా సాంకేతిక బృందానికి అభినందనలు’’ అని తెలిపారు.
‘పెద్ది’ సాధించిన ఘన విజయం తెలుగు సినిమాకు గర్వకారణమని, మరిన్ని విజయాలు సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















