నార్త్ అట్లాంటిక్ సముద్రంలోని Faroe Islandsలో ఘోర ఘటన చోటు చేసుకుంది. సంప్రదాయంగా కొనసాగుతున్న ‘గ్రైండాడ్రాప్’ వేటలో భాగంగా ఒకే రోజులో 700కుపైగా తిమింగలాలు, డాల్ఫిన్లు హతమయ్యాయి.
మే 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పర్యావరణ సంస్థ Sea Shepherd Conservation Society తెలిపిన వివరాల ప్రకారం, టోర్షావన్‌లోని సాండెగెర్డి బే వద్ద 402 పైలట్ తిమింగలాలు, నాలుగు బాటిల్‌నోస్ డాల్ఫిన్లు ఒడ్డుకు తీసుకొచ్చి హతమార్చారు. అనంతరం స్కాలబోట్నూర్, హాల్విక్ ప్రాంతాల్లో 300కుపైగా వైట్-సైడెడ్ డాల్ఫిన్లు చంపబడ్డాయి.
వేట సమయంలో ఆయుధాల కొరత ఏర్పడడంతో కొక్కేలు, కత్తులు ఉపయోగించి జంతువులను చంపినట్లు సమాచారం. ఈ దృశ్యాలను చిన్నారులు సహా ప్రజలు తీరంలో నుంచే చూస్తూ ఉండటం తీవ్ర ఆందోళన కలిగించింది. సముద్ర తీరం మొత్తం రక్తంతో ఎర్రగా మారిన దృశ్యాలు ప్రపంచాన్ని కలచివేశాయి.
ఈ ఘటనపై జంతు హక్కుల సంఘాలు తీవ్రంగా స్పందించాయి. దీన్ని అమానవీయ చర్యగా అభివర్ణిస్తూ, వెంటనే ఈ సంప్రదాయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే స్థానికులు ఇది వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సంప్రదాయమని చెబుతున్నారు.
ఫారో దీవుల పార్లమెంట్ ఇటీవల డాల్ఫిన్ వేటపై ఉన్న సంక్షేమ చట్టాన్ని సవరించడం కూడా ఈ ఘటనపై మరింత చర్చకు దారితీసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















