Coal India Limited (CIL), కోల్‌కతా ఆధ్వర్యంలో మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మైనింగ్ ఇంజినీరింగ్ డిగ్రీ కలిగిన అభ్యర్థులు GATE-2025 స్కోర్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 276 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో జనరల్ 114, EWS 27, SC 41, ST 20, OBC-NCL 74 పోస్టులు ఉన్నాయి.ఎంపిక ప్రక్రియలో మొదట GATE స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ప్రతి పోస్టుకు మూడు రెట్లు అభ్యర్థులను తదుపరి దశలకు ఎంపిక చేస్తారు. తర్వాత ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు ప్రొబేషన్‌లో పని చేయాలి. దేశవ్యాప్తంగా ఉన్న CIL అనుబంధ సంస్థల్లో ఎక్కడైనా పోస్టింగ్ ఉండవచ్చు.
వయోపరిమితి 30 ఏళ్లు మించకూడదు (30.04.2026 నాటికి). SC/ST/OBC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.వేతనం నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు ఉంటుంది. అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, బోనస్, మెడికల్ సదుపాయాలు, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు అందుతాయి.ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ 07 జూన్ 2026.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















