కాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలు, బహిరంగ విమర్శలు, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై అధిష్ఠానం దృష్టి సారించింది. పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తే వారు ఎంతటి స్థాయిలో ఉన్నా ఉపేక్షించకూడదని ఏఐసీసీ స్పష్టమైన వైఖరితో ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు ఒకరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మంత్రి నుంచి వివరణ కోరుతూ డీఏసీ నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠకు నష్టం కలిగించేలా ఉన్నాయన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు వచ్చిన నేపథ్యంలో ఈసారి వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి సైతం డీఏసీ నోటీసులు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు తీసుకుని టికెట్లు ఇచ్చారంటూ ఆయన చేసిన ఆరోపణలపై వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ విచారణకు చర్యలు చేపట్టింది.
ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య విభేదాలపైనా డీఏసీ స్పందించింది. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ సంజయ్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన జిల్లా కాంగ్రెస్ సమావేశంలో వీరు పరస్పరం బహిరంగ విమర్శలు చేసుకున్న తీరుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
మరోవైపు ఎల్బీనగర్ కాంగ్రెస్ సీనియర్ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వ్యక్తిగత అంశాలపై పలువురిని కులాల పేరుతో దూషించినట్లు ఆధారాలు లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఏసీ వెల్లడించింది.
పార్టీని బలహీనపరిచేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం, అంతర్గత విభేదాలను రచ్చకెక్కించడం, పార్టీ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేయడాన్ని ఇకపై సహించకూడదని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నోటీసులు అందుకున్న నేతల నుంచి వివరణలు తీసుకున్న అనంతరం విచారణ జరిపి, అవసరమైన చర్యల కోసం పీసీసీకి నివేదిక అందించనున్నట్లు డీఏసీ వర్గాలు తెలిపాయి.
పార్టీలో క్రమశిక్షణను కాపాడటంతో పాటు, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్యలకు అడ్డుకట్ట వేయడమే తాజా చర్యల ఉద్దేశంగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లోనూ ఇలాంటి వ్యవహారాలపై మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















