చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యంగ్ ప్లేయర్ ఆయుష్ మాత్రే గాయంపై వ్యవహరించిన తీరుపై టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర విమర్శలు చేశాడు.మోకాలి గాయంతో బాధపడుతున్నప్పటికీ, మాత్రే శనివారం మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతడు మోకాలి కట్టుతో కుంటుతూ ఆడినప్పటికీ, CSK అతని బ్యాటింగ్ కొనసాగించడానికి అనుమతించిందని అశ్విన్ పేర్కొన్నాడు.
“మాత్రే గత 2-3 మ్యాచ్‌లుగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా వస్తున్నాడు. అతడు మంచి ఫీల్డర్ కూడా. కానీ కుంటుతూ ఉన్న ప్లేయర్‌ను ఎలా కొనసాగిస్తారు? వికెట్ల మధ్య పరుగులు ఎలా తీస్తాడు?” అని అశ్విన్ ప్రశ్నించాడు.
అతడు ఇంకా మాట్లాడుతూ, గాయపడిన ఆటగాడిని వెంటనే రిటైర్డ్ ఔట్ చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. “ఈ సీజన్లో స్టార్లలో ఒకడైన మాత్రే విషయంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. ఇది నిజంగా దిగ్భ్రాంతికరం” అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.మ్యాచ్‌లో మాత్రే చివరకు నితీశ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















