ఇన్‌స్టాలో మీరు చూస్తున్న కంటెంట్ పూర్తిగా మీ ఇష్టాలకు అనుగుణంగా ఉండకపోవడం సర్వసాధారణం. చిన్న పిల్లలు, పెద్దవాళ్లు ఎవరు అయినా రీల్స్ చూస్తున్నప్పుడు ఇష్టపడని కంటెంట్ కూడా ఫీడ్‌లో కనిపిస్తుంది. దీన్ని సరిచేసుకోవడానికి అల్గారిథమ్ రీసెట్ ఉపయోగించవచ్చు.
ఎలా పనిచేస్తుంది:
- ఇన్‌స్టా అల్గారిథమ్ మీ ఫీడ్‌లో చూపించే కంటెంట్‌ను మీ గత ఆసక్తుల ఆధారంగా సెట్ చేస్తుంది.
- సినిమా, స్పోర్ట్స్, ఆధ్యాత్మికం లాంటి విషయాలు, మీ ఇష్టాలను గమనించి ఫీడ్‌లో చూపిస్తుంది.
- రీసెట్ చేస్తే, అల్గారిథమ్ తిరిగి ప్రారంభమవుతుంది, తద్వారా కొత్తగా మీ ఇష్టాలను గమనించి, ఫీడ్‌ను అనుకూలంగా చూపుతుంది.
రిసెట్ చేయడం స్టెప్స్:
- ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్‌లోకి వెళ్లండి.
- కుడి పైభాగంలో ఉన్న 3 డాట్స్ మెనూ పై క్లిక్ చేయండి.
- కిందికి స్క్రోల్ చేసి What you see లోని Content Preferences పై క్లిక్ చేయండి.
- Reset suggested content ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
- Want a fresh start? అని పాప్-అప్ వస్తుంది, Terms & Conditions అంగీకరించాలి.
- చివరగా Reset suggested content నొక్కితే, రీసెట్ పూర్తిగా అయి, మీరు ఇష్టపడిన కంటెంట్ మళ్లీ ఫీడ్‌లో కనిపిస్తుంది.
ఇలా చేస్తే, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫీడ్ పూర్తిగా మీ ఆసక్తులకు అనుగుణంగా ఉంటుంది, అసంబద్ధ కంటెంట్ తగ్గుతుంది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNow WorldNews

















