చైనా ప్రభుత్వంపై అసమ్మతి గళం వినిపించి పలుమార్లు నిర్బంధానికి గురైన ఓ మాజీ పోలీసు అధికారి చేసిన సాహసోపేత సముద్ర ప్రయాణం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
68 ఏళ్ల డాంగ్ గాంగ్‌పింగ్ (Dong Guangping) చిన్న రబ్బరు పడవలో సుమారు 30 గంటలపాటు ప్రమాదకర సముద్ర ప్రయాణం చేసి దేశ సరిహద్దులు దాటి వెళ్లిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్వేచ్ఛ కోసం, కుటుంబాన్ని కలుసుకునే లక్ష్యంతో ఆయన ఈ అత్యంత రిస్క్‌తో కూడిన ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది.
డాంగ్ గాంగ్‌పింగ్ చైనా మాజీ పోలీసు అధికారి. 1989 తియాన్మెన్ స్క్వేర్ అణచివేత ఘటన జరిగిన పదేళ్ల తర్వాత, ఆ ఘటనను వ్యతిరేకిస్తూ ఆయన ఒక లేఖపై సంతకం చేశారు. ఆ చర్యతో ఆయన ఉద్యోగాన్ని కోల్పోయారు. తరువాత కూడా ప్రభుత్వ విధానాలపై అసమ్మతి వ్యక్తం చేస్తూ పలుమార్లు అరెస్టులకు గురయ్యారు. దీంతో చైనాలో ఉండటం వల్ల స్వేచ్ఛ లభించదని భావించి దేశం విడిచిపోవాలని నిర్ణయించుకున్నారు.
2015లో తన కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్ వెళ్లగా, ఆయనను తప్ప మిగతా కుటుంబ సభ్యులకు కెనడాకు వెళ్లే అవకాశం లభించింది. అయితే థాయ్ అధికారులు డాంగ్‌ను చైనాకు డిపోర్ట్ చేశారు. అక్కడ మళ్లీ జైలు శిక్ష అనుభవించిన ఆయన 2019లో విడుదలయ్యారు.
విడుదల తర్వాత కూడా కుటుంబాన్ని కలుసుకోవాలనే ప్రయత్నాలను కొనసాగించారు. ఈ క్రమంలో అక్రమంగా సరిహద్దు దాటేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ చైనా అధికారులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విడుదలైన తర్వాత, ఆయన వెయిహై ప్రాంతం నుంచి సముద్రంలో రబ్బరు పడవలో ప్రయాణం ప్రారంభించారు.
సుమారు 30 గంటల ప్రమాదకర ప్రయాణం తర్వాత ఆయన దక్షిణ కొరియా తీరానికి చేరుకున్నారు. అక్కడ మత్స్యకారులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో కోస్ట్ గార్డ్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన చైనా–దక్షిణ కొరియా సంబంధాలపై ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. దక్షిణ కొరియా ఆయనను బహిష్కరించే అవకాశం ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి. మరోవైపు, మానవ హక్కుల సంఘాలు ఆయనను తిరిగి చైనాకు పంపించవద్దని కోరుతూ, కుటుంబంతో కలిసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews
















