ఇరాన్‌పై అమెరికా మరోసారి సైనిక చర్యలకు దిగింది. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలోని ఒక వ్యూహాత్మక సైనిక స్థావరాన్ని యూఎస్ దళాలు లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడులు తమ బలగాలు, వాణిజ్య నౌకల భద్రతను కాపాడేందుకు ముందస్తు చర్యలుగా చేపట్టినట్లు అమెరికా అధికారులు పేర్కొంటున్నారు.
వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ ప్రాంతంలో భద్రతా కారణాలతోనే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు వారు తెలిపారు. ఇరాన్ అమెరికా వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని నాలుగు డ్రోన్లను ప్రయోగించిందని, వాటిని అమెరికా దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయని వెల్లడించారు.
టెహ్రాన్ మరిన్ని దాడులకు పాల్పడకముందే తమ దళాలు ఇరాన్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని అమెరికా వర్గాలు పేర్కొన్నాయి. ఇది పూర్తిగా ఆత్మరక్షణ కోసం తీసుకున్న ముందస్తు చర్య అని వారు సమర్థించుకున్నారు. ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరిగినదీ లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
ఇదే సమయంలో హర్మూజ్ సమీపంలో అమెరికా తరచూ సైనిక చర్యలకు దిగడంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరుదేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని టెహ్రాన్ ఆరోపించింది.
ఇక ఇదిలా ఉండగా, బందర్ అబ్బాస్ ఓడరేవు ప్రాంతంలో మూడు సార్లు పేలుడు శబ్దాలు వినిపించడంతో ఇరాన్ వైమానిక దళాలు అప్రమత్తమయ్యాయి. అయితే ఈ పేలుళ్లకు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు.
ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు Donald Trump అబ్రహాం ఒప్పందాలపై (Abraham Accords) కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, ఈజిప్ట్, తుర్కియే, ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేయడానికి అంగీకరిస్తేనే ఇరాన్‌తో ఒప్పందం సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, తన అల్లుడు జారెడ్ కుష్నర్ ఈ దిశగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews
















