హైదరాబాద్‌లోని బేగంపేట్ ప్రాంతంలో 145 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన చిరాన్ ఫోర్ట్ క్లబ్ కూల్చివేతపై తీవ్ర వివాదం నెలకొంది. గ్రేడ్–II వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ఈ రాజభవనాన్ని కూల్చివేస్తుండటంపై చరిత్రాభిమానులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ నిర్మాణ సంస్థ కోసం ఈ చారిత్రక భవనాన్ని కూల్చివేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ చర్య వెనుక రాజకీయ ప్రమేయం ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి.
పైగాహ్ వంశానికి చెందిన ఒబైద్ ఉర్ రెహ్మాన్ ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాల చరిత్రను మోసుకొచ్చిన ఈ కట్టడాన్ని కూల్చేయడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనతో వారసత్వ కట్టడాల పరిరక్షణపై మళ్లీ చర్చ మొదలైంది. నగరాభివృద్ధి పేరుతో చారిత్రక సంపదను నాశనం చేయడం సరైనదేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















