హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ‘సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సిటీ’ ప్రాజెక్ట్ విశేషాలను కేంద్ర మంత్రి G. Kishan Reddy ఎక్స్ (X) వేదికగా పంచుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భవనం ఆకృతులను కూడా తొలిసారిగా విడుదల చేశారు.
ఎన్‌జీఆర్‌ఐ పక్కనే ఐఐసీటీ ప్రాంగణంలో సుమారు రూ.232.70 కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టును నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (NCSM) అమలు చేస్తోంది. శాస్త్రవిజ్ఞానాన్ని పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకుండా, ప్రయోగాత్మక విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు.
ఈ సైన్స్ సిటీలో త్రీడీ డిజిటల్ డోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇది అంతరిక్షం, ఖగోళ శాస్త్ర విశేషాలను అత్యాధునిక సాంకేతికతతో చూపించనుంది. వాక్ త్రూ అక్వేరియం ద్వారా సముద్ర జీవనాన్ని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం కలుగుతుంది.మోషన్ సిమ్యులేటర్లు ఫిజిక్స్, ఏరోనాటిక్స్ సూత్రాలను అనుభవాత్మకంగా నేర్చుకునేందుకు ఉపయోగపడతాయి. రోబోటిక్స్ సెంటర్‌లో రోబోటిక్స్ శిక్షణ, ప్రదర్శనలు నిర్వహిస్తారు. అంతరిక్ష ప్రదర్శనశాలలో Indian Space Research Organisation విజయాలు, రాకెట్ నమూనాలు ప్రదర్శించనున్నారు.అదేవిధంగా ఇన్నోవేషన్ హబ్స్‌లో విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలకు రూపకల్పన చేసేందుకు ప్రయోగశాలలు, యాక్టివిటీ జోన్లు ఏర్పాటు చేయనున్నారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















