రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌరసరఫరాల శాఖ చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. పలు పెట్రోల్ బంకుల్లో “నో స్టాక్” బోర్డులు దర్శనమిస్తున్నాయి.కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సహా అనేక ప్రాంతాల్లో వాహనదారులు ఇంధనం కోసం బారులు తీరుతున్నారు. కొన్ని చోట్ల పోలీసు భద్రత మధ్య విక్రయాలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.
తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25% బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఆయిల్ కంపెనీల నుంచి సరఫరా ఆలస్యమవుతుండటం ప్రధాన సమస్యగా ఉంది. డబ్బులు చెల్లించినా రెండు, మూడు రోజులు ట్యాంకర్లు రాకపోవడం వల్ల డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు, రూపాయి విలువ తగ్గడం, బీమా ఖర్చులు పెరగడం వంటి కారణాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రభావం పడుతోందని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి.
ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, మెదక్, గద్వాల జిల్లాల్లో ఇంధన కొరత మరింత తీవ్రమైంది. కొన్ని బంకుల్లో పెట్రోల్ ఉంటే డీజిల్ లేదు, డీజిల్ ఉంటే పెట్రోల్ లేదు అనే పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్‌లోనూ కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపించాయి. సూర్యాపేటలో పదిహేనుకు పైగా బంకులు తాత్కాలికంగా మూసివేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దాదాపు సగానికి పైగా బంకులు మూతపడ్డాయని సమాచారం. దూర ప్రయాణాల్లో వాహనాలు ఇంధనం లేక రహదారులపై నిలిచిపోతున్నాయి. ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని చెబుతూ, సమస్యల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1967ను సంప్రదించాలని సూచిస్తోంది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















