జనగణన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో “స్వీయ నమోదు” (Self Enumeration) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ వివరాలను నమోదు చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర జనాభా లెక్కల విభాగం అధికారులు వారి ఇళ్లకు వెళ్లి స్వీయ నమోదు ప్రక్రియను వివరించి, వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
గవర్నర్, సీఎం, సీఎస్, మండలి ఛైర్మన్ తదితరులు సెన్సస్ వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ జనాభా గణన అనేది దేశ అభివృద్ధి ప్రణాళికలకు పునాది అని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారం అందించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. వనరుల సమాన పంపిణీకి, సుపరిపాలనకు ఇది కీలకమని వివరించారు. ఈ స్వీయ నమోదు ప్రక్రియ మే 10 వరకు కొనసాగనుంది. ప్రజలందరూ ఇందులో పాల్గొని ఖచ్చితమైన వివరాలు అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















