తొలి ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న Kolkata Knight Riders.. ఇప్పుడు వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. మొదటి అర్ధభాగంలో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న కేకేఆర్.. ఇప్పుడు ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరికగా మారింది. తొలి విజయంతో ఆత్మవిశ్వాసం అందుకున్న నైట్‌రైడర్స్.. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ముందుగా Rajasthan Royalsపై గెలిచిన కోల్‌కతా.. తర్వాత Lucknow Super Giantsతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. వరుసగా ఐదు విజయాలతో జోరుమీదున్న Sunrisers Hyderabadకు వారి సొంత మైదానంలోనే షాక్ ఇచ్చిన కేకేఆర్.. తాజాగా Delhi Capitalsను కూడా వారి హోం గ్రౌండ్‌లో చిత్తు చేసి వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత బలపడ్డాయి. ప్రస్తుతం 9 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్న కోల్‌కతా.. ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే కేకేఆర్ 17 పాయింట్లతో నేరుగా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకునే అవకాశం ఉంది. ఒక మ్యాచ్‌లో ఓడినా 15 పాయింట్లతో అవకాశాలు నిలిచే ఛాన్స్ ఉన్నా.. అది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడనుంది. కేకేఆర్ మిగిలిన మ్యాచ్‌లు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. మే 13న Royal Challengers Bengaluruతో రాయ్‌పుర్‌లో తలపడనున్న కోల్‌కతా.. ఆ తర్వాత Gujarat Titans, Mumbai Indians, Delhi Capitalsతో వరుస పోరులకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా చివరి మూడు మ్యాచ్‌లు సొంత మైదానం Eden Gardensలో జరగడం కేకేఆర్‌కు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ఈ సీజన్‌లో అక్కడ రెండు విజయాలు సాధించిన నైట్‌రైడర్స్.. మరో మ్యాచ్‌లో ఓడగా, ఇంకొకటి వర్షం కారణంగా రద్దయింది. మరోవైపు స్పిన్నర్ Varun Chakravarthy మళ్లీ ఫామ్‌లోకి రావడం జట్టుకు భారీ ప్లస్‌గా మారింది. అతడి స్పిన్ మాయాజాలం ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడుతుండగా.. కేకేఆర్ విజయయాత్రకు కీలక ఆయుధంగా నిలుస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















