మహిళల టీ20 ప్రపంచకప్ (Womens T20 World Cup 2026) జూన్ 12 నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. టోర్నమెంట్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు వేగం పెంచుకున్నాయి. ఇటీవల అన్ని జట్ల కెప్టెన్లతో ప్రత్యేక ఫొటోషూట్ నిర్వహించగా, అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది.
ఈ సందర్భంగా భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను మీడియా ప్రతినిధులు పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. అందులో ఒక రిపోర్టర్, “ఈ టీ20 ప్రపంచకప్ మీకు చివరిది అవుతుందా?” అని ప్రశ్నించగా, హర్మన్‌ప్రీత్ సరదాగా స్పందించింది. “నేను తప్పుకోవాలని మీరు కోరుకుంటున్నారా?” అని ఎదురు ప్రశ్న వేసింది.
దానికి రిపోర్టర్ స్పందిస్తూ, “మీ ప్రణాళికలు తెలుసుకోవడానికే అడిగాను. మీరు ఇంకా టీ20 నుంచి రిటైర్ కావడానికి సమయం రాలేదని చెప్పడం సంతోషంగా ఉంది” అని అన్నాడు. ఈ సంభాషణ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నవ్వులు పూయించింది.
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు విజయం సాధించడంతో ఈసారి టీ20 వరల్డ్‌కప్‌లో కూడా టీమ్ఇండియాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ విషయంపై హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ, బయటి ఒత్తిడిని ఎక్కువగా పట్టించుకోకుండా తన ఆటపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తానని తెలిపింది.
“విజయం తర్వాత సహజంగానే అంచనాలు పెరుగుతాయి. కానీ నేను దీన్ని మహిళల క్రికెట్ అభివృద్ధికి మంచి సంకేతంగా చూస్తున్నాను. ప్రజలు మ్యాచ్‌లను ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇది సానుకూల పరిణామం. అయితే వ్యక్తిగతంగా నేను బయటి ఒత్తిడిని ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. నా ఫోకస్ ఎప్పుడూ సన్నద్ధత, జట్టు సహకారం, ప్రస్తుత పరిస్థితులపైనే ఉంటుంది” అని ఆమె వివరించింది.
భారత్ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ హై-వోల్టేజ్ పోరు జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















