కల్వకుర్తి మండల పరిధిలోని సీబీఎం కళాశాల సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయచూర్–కోదాడ జాతీయ రహదారిపై కారు, ప్రైవేట్ పాఠశాల బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ప్రభుత్వ వైద్యుడు విజయ్ కుమార్ (43) తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల వివరాల ప్రకారం, ప్రమాదం అనంతరం వెంటనే స్థానికులు సహాయంతో ఆయనను కల్వకుర్తి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విజయ్ కుమార్ ప్రతిరోజూ పట్టణ సమీపంలోని వందేమాతరం ఫౌండేషన్ ఆవరణలో వ్యాయామం చేసేవారని, ఆ రోజు కూడా వ్యాయామం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. ఆయన నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందినవారు కాగా, గత మూడు సంవత్సరాలుగా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా సేవలందిస్తున్నారు.
మృతుడికి భార్య యశ్వంత్ రాణి ఉండగా, ఆమె కూడా వైద్యురాలిగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఈ ఘటనతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
వైద్యుడు విజయ్ కుమార్ మృతికి సహచర వైద్యులు, స్థానికులు, ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews


















