దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి . మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం, అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు సూచీలపై ఒత్తిడి తెచ్చాయి. ఒక దశలో సెన్సెక్స్ 700 పాయింట్ల వరకు పతనమవడం గమనార్హం.
ట్రేడింగ్‌ను సూచీలు నష్టాలతోనే ప్రారంభించాయి. ఉదయం సెన్సెక్స్ 76,224 వద్ద ప్రారంభమైంది. అయితే రోజంతా ఒడిదుడుకులు కొనసాగిన తర్వాత చివరకు 479 పాయింట్లు నష్టంతో 76,009 వద్ద ముగిసింది. నిఫ్టీ 118 పాయింట్లు తగ్గి 23,913 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ సూచీలో కొన్ని షేర్లు మాత్రం రాణించాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, టీఎంపీవీ, టెక్ మహీంద్రా, నెస్లే, ఎటర్నల్ షేర్లు లాభాల్లో నిలిచాయి. మరోవైపు అపోలో హాస్పిటల్స్, విప్రో, భారతీ ఎయిర్‌టెల్, ట్రెంట్, టీసీఎస్ షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.73 వద్ద ముగిసింది.
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఆశలు పెరగడంతో గత సెషన్‌లో సూచీలు రెండు వారాల గరిష్ఠాలను తాకాయి. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ముఖ్యంగా చమురు ధరల పెరుగుదల మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీనికి తోడు డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియడం వల్ల మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో కదలాడాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government HyderabadNews India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















