దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం, డాలరుతో రూపాయి మారకం విలువ తొలిసారి 96 మార్కును దాటడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీనికితోడు మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో రెండ్రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది.
సెన్సెక్స్ ఉదయం 75,497.10 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 75,398.72) లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 75,870.36 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. చివరికి 160.73 పాయింట్ల నష్టంతో 75,237.99 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 46.10 పాయింట్ల నష్టంతో 23,643.50 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 96.15 వద్ద కనిష్ఠాన్ని తాకి 95.94కి చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ఎటర్నల్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 108 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 4,560 వద్ద ట్రేడవుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















