పరమేశ్వరుడు, ప్రళయకాల రుద్రుడు, శివయ్య, భోళా శంకరుడు, అర్ధనారీశ్వరుడు.. కోరిన వెంటనే వరాలిచ్చే ఆ ముక్కింటికి ఎన్నో పేర్లు. ఏ పేరుతో పిలిచినా పలికే దైవం. అందుకే పండగ రోజుల్లో పాటు ప్రతీ సోమవారం శివాలయాలు శివనామ స్మరణతో మార్మోమోగుతాయి. ఈ క్రమంలోనే ఇంట్లో కూడా మహాశివుడికి నిత్యం పూజలు చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది.. పూజ గదిలో శివలింగం ప్రతిష్ఠించుకుంటారు. మరి, ఇంట్లో శివలింగం ప్రతిష్ఠించవచ్చా? ఏ సైజులో ఉండాలి? ఎటువంటి శివలింగం ఉంచాలి? అనే సందేహాలు చాలా మందికి వస్తాయి. మరి, వాటికి జ్యోతిష్యులు ఏం సమాధానమిస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం.
ఇంట్లో శివలింగం ఉండొచ్చా?: ఇంట్లోని పూజ గదిలో శివలింగాన్ని ఉంచితే ఎవరికైనా అనుకూల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. శివమహా పురాణం ప్రకారం స్త్రీ, పురుష, నపుంసక బేధం లేకుండా పూజగదిలో శివలింగం ఉంచి దానికి అభిషేకం చేసుకోవచ్చని వివరిస్తున్నారు. అభిషేకం చేయడానికి వీలులేని రోజుల్లో ఓ గిన్నెలో శివలింగం ఉంచి అది మునిగే వరకు నీళ్లు పోసి మందిరంలో ఉంచితే ఎటువంటి తప్పూ ఉండదని అంటున్నారు.
ఎన్ని అంగుళాలు ఉన్న శివలింగం ప్రతిష్ఠించాలి?: ధర్మశాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతిష్ఠించే శివలింగం ఎత్తుకు సంబంధించి ఓ శ్లోకం ఉందని మాచిరాజు చెబుతున్నారు. ఆ శ్లోకం ఏంటంటే..
ఏక త్రి పంచ సప్తైవహి అంగుళాని ప్రమాణతః
శుభదం గృహమధ్యేతు శివలింగం ప్రశస్య్తతే ||
ఈ శ్లోకం ప్రకారం ఒకటి లేదా మూడు లేదా ఐదు లేదా ఏడు అంగుళాలు కలిగిన శివలింగాన్ని ఇంట్లో పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే శుభఫలితాలను కలిగిస్తుందని వివరిస్తున్నారు. వాస్తు, ప్రతిష్ఠలు, పూజగదిలో విగ్రహాల పరంగా ఎత్తును అంగుళాలలో లెక్కించేటప్పుడు బేసి సంఖ్య తీసుకోవాలని శాస్త్రం చెబుతున్నట్లు పేర్కొంటున్నారు. సరి సంఖ్య కాకుండా పైన చెప్పిన లెక్క ప్రకారం బేసి సంఖ్యలో అంగుళాల ఎత్తులో తీసుకోవాలని ముఖ్యంగా ఏడు అంగుళాలకు మించకూడదని చెబుతున్నారు.
ఎలాంటి శివలింగాన్ని ప్రతిష్ఠించాలి: శివలింగాల్లో అనేక రకాలు ఉంటాయి. మరి, శాస్త్ర ప్రకారం ఎలాంటి లింగాన్ని ఎంచుకుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే..
స్పటిక లింగం: లక్ష శివలింగాలకు పూజ చేస్తే, అభిషేకం చేస్తే ఎంత ఫలితం లభిస్తుందో.. ఆ ఫలితానికి కోటిరెట్ల ఫలితం రావాలంటే స్పటిక శివలింగాన్ని పూజించాలని అంటున్నారు.
పాదరస లింగం: ఎవరైతే పూజ గదిలో పాదరస లింగాన్ని ఉంచి పూజ, అభిషేకం చేస్తారో వారికి సర్వ సంపదలు, సర్వ సిద్ధులు లభిస్తాయని అంటున్నారు. అలాగే మోక్షం లభిస్తుందని అంటున్నారు.
మరకత లింగం: ఎవరైతే పూజ గదిలో మరకత లింగాన్ని ఉంచి పూజ, అభిషేకం చేస్తారో వారికి జ్ఞానం కలుగుతుందని, విద్యలో రాణిస్తారని చెబుతున్నారు. అలాగే ధనధాన్యాలు, సౌభాగ్యం కలుగుతుందని వివరిస్తున్నారు. అంతేకాకుండా సర్వ వ్యాధులు నశిస్తాయని చెబుతున్నారు.
నర్మదా బాణ లింగం: ఎవరైతే పూజ గదిలో నర్మదా బాణ లింగాన్ని ఉంచి పూజ, అభిషేకం చేస్తారో వారికి వైభవం కలుగుతుందని అంటున్నారు. భయంకరమైన శత్రు బాధలు తొలగిపోతాయని, సౌభాగ్యం కలుగుతుందని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















