బంగారం ధరలు పెరగడంతో హైదరాబాద్లో చైన్ స్నాచింగ్లు విపరీతంగా పెరిగాయని, అంతర్రాష్ట్ర ముఠాలు నగరంలో మకాం వేశాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఖండించారు. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.
సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందించిన సజ్జనార్.. ధ్రువీకరణ లేని వార్తలు, భయపెట్టే పోస్టులను నమ్మవద్దని, ఫార్వార్డ్ చేయవద్దని ప్రజలను కోరారు. భయాందోళనలు సృష్టించే అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హైదరాబాద్ నగరం పూర్తిగా సురక్షితమని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏదైనా అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. “నిశ్చింతగా ఉండండి.. మీ భద్రతే మా బాధ్యత” అని సీపీ సజ్జనార్ భరోసా ఇచ్చారు.
Accident Alert Amaravathi Andhra pradesh Andhrapradesh Breaking news BreakingNews BreakingNewsTelugu Chandrababu naidu Climate Cricket Crime News Development Devotion Devotional Farmers Flood Government Heavy rains High court Hyderabad India Investment Karthika masam Mantha Toofan Movie Nara Lokesh Naralokesh News PM Modi Police Politics Review Road accident Sports Srikakulam Tdp Telangana TeluguNews Toofan USA Warning Weather YCP YSRCP


















