హైదరాబాద్‌లో అత్యాధునిక వైద్య సేవలకు మరో పెద్ద కేంద్రం అందుబాటులోకి రానుంది. ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డా.ఎంసీఆర్ టిమ్స్) సనత్‌నగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సోమవారం నుంచి ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించనుంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరుకానున్నారు.
22.6 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.1,100 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో మొత్తం 1,000 పడకలు ఉన్నాయి. ఐదు బ్లాకుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలను సిద్ధం చేశారు. ఇప్పటికే ట్రయల్ రన్‌లో భాగంగా డే కేర్ విభాగాలను ప్రయోగాత్మకంగా నిర్వహించి రోజుకు సుమారు 250 మంది రోగులకు సేవలు అందించారు.
టిమ్స్‌లో వైద్య సేవలు అందించేందుకు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ తదితర ఆసుపత్రుల నుంచి వైద్య సిబ్బందిని తీసుకురావడంతో పాటు కొత్తగా సుమారు 200 మంది వైద్య సిబ్బందిని నియమించారు. దీంతో ఆసుపత్రి పూర్తిస్థాయి కార్యకలాపాలకు సిద్ధమైంది.
మరోవైపు ప్రారంభోత్సవ ఏర్పాట్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదివారం పరిశీలించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైద్యులు, మీడియా ప్రతినిధులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా పోలీసు, ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
వెయ్యి పడకల సామర్థ్యంతో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ వైద్య మౌలిక వసతుల్లో టిమ్స్ కీలక కేంద్రంగా నిలవనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















