విజయవాడ ఎంపీ Kesineni Sivanath లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తన భార్యకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు. ఈడీ నుంచి వచ్చిన నోటీసులు కేవలం కంపెనీకి మాత్రమే సంబంధించినవని ఆయన తెలిపారు.
ఇశాన్వీ, కేశినేని డెవలపర్స్ కలిసి నిర్వహించిన రియల్ ఎస్టేట్ సంస్థ ప్రైడ్ ఇన్ఫ్రాకు సంబంధించి ఈడీ నోటీసులు వచ్చాయని చెప్పారు. ఈ విషయంపై ఈ నెల 27న అధికారికంగా వివరణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.పక్కపక్క సైట్లు ఉండటంతో 2021లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రైడ్ ఇన్ఫ్రా సంస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ సంస్థ ద్వారా కేవలం రూ.35 లక్షల లావాదేవీలు మాత్రమే జరిగాయని తెలిపారు.
రాజ్ కె. రెడ్డికి సంబంధించిన ఇశాన్వీ సంస్థ విషయం తెలియగానే 2022లోనే కంపెనీ నుంచి పూర్తిగా బయటకు వచ్చేశామని స్పష్టం చేశారు. ఆర్కిటెక్ట్ ఫీజు కోసం జరిగిన రూ.35 లక్షల లావాదేవీ తప్ప మరే ఆర్థిక లావాదేవీలు జరగలేదని ఆయన తెలిపారు.లిక్కర్ స్కామ్‌లో తన భార్యకు నోటీసులు వచ్చినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కేశినేని శివనాథ్ ఖండించారు. కంపెనీలో తన భార్య కేవలం డైరెక్టర్‌గా మాత్రమే ఉన్నారని, కానీ వ్యక్తిగతంగా ఆమెకు ఎలాంటి నోటీసులు రాలేదని ఆయన స్పష్టం చేశారు.ఈడీ అడిగిన ప్రశ్నలకు పూర్తి వివరాలతో సమాధానం ఇస్తామని, తాము ఏ తప్పు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















