Ebola వైరస్ వ్యాప్తి ఆఫ్రికా దేశాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా Democratic Republic of the Congoలో ఎబోలా కేసులు పెరుగుతుండటంతో పాటు తప్పుడు సమాచారం, సంప్రదాయ ఆచారాలు వైరస్ నియంత్రణకు పెద్ద సవాలుగా మారాయి.
కాంగోలోని ర్వాంపారా ప్రాంతంలో ఎబోలా లక్షణాలతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని వైద్య సిబ్బంది అప్పగించకపోవడంతో ఆగ్రహించిన స్థానికులు చికిత్సా కేంద్రానికి నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. ప్రజారోగ్య చర్యలు, స్థానిక సంప్రదాయాల మధ్య సమతుల్యత పాటించడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు.
1976లో తొలిసారి గుర్తించిన ఎబోలా వైరస్ ప్రస్తుతం 17వసారి వ్యాప్తి చెందుతోంది. World Health Organization ఇప్పటికే దీనిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రత్యేక చికిత్సలు, ఆమోదిత టీకాలు లేకపోవడం వల్ల వైరస్‌ను అరికట్టడం మరింత క్లిష్టంగా మారింది.
ఎబోలా వైరస్ ప్రధానంగా గబ్బిలాలు, అడవి జంతువుల ద్వారా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన జంతువుల మాంసాన్ని ‘బుష్‌మీట్’గా తినడం వల్ల మనుషులకు సంక్రమిస్తుంది. అలాగే వైరస్ సోకిన వ్యక్తుల శరీర ద్రవాలు, సంప్రదాయ అంత్యక్రియల సమయంలో మృతదేహాన్ని తాకడం ద్వారా కూడా వ్యాప్తి చెందుతోంది.
ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న బండిబుగ్యో ఎబోలా రకానికి ఆమోదిత టీకా అందుబాటులో లేకపోవడం మరో ఆందోళనగా మారింది. త్వరలోనే మానవులపై టీకా ప్రయోగాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















