విద్యుత్ అంతరాయాల నేపథ్యంలో ప్రజలకు వేగంగా సమాచారం అందించేందుకు బల్క్ మెసేజ్‌లు, మీడియా ద్వారా అప్డేట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి Gottipati Ravi Kumar అధికారులను ఆదేశించారు. అలాగే కాల్ సెంటర్లలో టోల్‌ఫ్రీ నంబర్ 1912 ద్వారా 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితులపై ట్రాన్స్‌కో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు మరియు విద్యుత్ శాఖకు మధ్య కాల్ సెంటర్లు సమన్వయకర్తగా పనిచేయాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరచడానికి నిర్మాణంలో ఉన్న ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సబ్‌స్టేషన్లు, ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
అధిక వేడి, గాలివానల కారణంగా విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని అధికారులు సమావేశంలో వివరించారు. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, ట్రాన్స్‌కో జేఎండీ ప్రవీణ్‌చంద్, డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు, సీఈలు, జిల్లాల ఎస్‌ఈలు వర్చువల్‌గా ఈ సమీక్షకు హాజరయ్యారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















