స్థానిక వాహనదారులకు టోల్ చెల్లింపుల విషయంలో ఊరట కల్పించేలా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) డిజిటల్ ఫాస్టాగ్ లోకల్ పాస్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 121 టోల్ ప్లాజాల్లో ఈ సౌకర్యాన్ని ప్రారంభించింది.
ఈ పాస్‌కు అర్హత ఉన్న వాహనదారులు ఇక టోల్‌ప్లాజా కార్యాలయానికి నేరుగా వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాజ్‌మార్గ్‌యాత్ర మొబైల్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా నెలవారీ లోకల్ పాస్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఎవరికి అర్హత?
సంబంధిత టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానిక వాహనదారులు ఈ పాస్ పొందేందుకు అర్హులు. నిబంధనలకు అనుగుణంగా పాస్ జారీ అయిన తర్వాత సంబంధిత టోల్‌ప్లాజా మీదుగా అపరిమితంగా ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది.వాహనదారుల స్థానిక చిరునామా, వాహన వివరాలను ధ్రువీకరించేందుకు డిజిలాకర్, వాహన్ వంటి డిజిటల్ వేదికలను అనుసంధానించారు. టోల్‌ప్లాజాకు వాహనదారుడి నివాసం 20 కిలోమీటర్ల పరిధిలో ఉందా లేదా అన్నది జీఐఎస్ ఆధారిత లొకేషన్ ద్వారా పరిశీలిస్తారు.
ఏపీ, తెలంగాణలో ఎన్ని?
రాజ్‌మార్గ్‌యాత్రలో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 12, తెలంగాణలో 3 టోల్‌ప్లాజాలను ఈ సదుపాయానికి ఎంపిక చేశారు. మీకు సమీపంలోని టోల్‌ప్లాజా ఈ జాబితాలో ఉందో లేదో ఆన్‌లైన్‌లోనే తెలుసుకోవచ్చు.
అర్హత ఉన్నవారు సంబంధిత వివరాలు, పత్రాలను డిజిటల్‌గా సమర్పించి పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో టోల్‌ప్లాజా వద్దకు వెళ్లి మాన్యువల్‌గా పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















