హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాబ్ భవనం నుంచి దట్టమైన పొగలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం, భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్‌లో తొలుత మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి మంటలు క్రమంగా ఇతర భాగాలకు వ్యాపించడంతో ల్యాబ్‌లో పనిచేస్తున్న సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. మొత్తం ఐదు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. భవనంలో పొగలు ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం స్పష్టమైన కారణాలు వెల్లడిస్తామని తెలిపారు.ఘటనాస్థలికి నార్త్ జోన్ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు.
అగ్ని ప్రమాదం నేపథ్యంలో ల్యాబ్ పరిసర ప్రాంతాలను పోలీసులు ఖాళీ చేయించి, ట్రాఫిక్‌ను మళ్లించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















