అమెరికాలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్డ్‌లో చోటుచేసుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చాక్లెట్ కుకీ దొంగతనం చేశాడనే ఆరోపణలతో రూ.1.9 కోట్ల వార్షిక వేతనం పొందుతున్న ఓ సీనియర్ ఉద్యోగిని కంపెనీ తొలగించినట్లు సమాచారం.
కెంటకీ రాష్ట్రం లూయిస్‌విల్లేలోని ఫోర్డ్ ట్రక్ ఫ్యాక్టరీలో 60 ఏళ్ల కర్ట్ క్రోమ్ గత 11 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వారానికి సగటున 60 గంటల వరకు పని చేసిన తాను సంస్థకు విధేయుడిగా ఉన్నానని, కానీ తప్పుడు ఆరోపణలతో ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాను గత ఏడాది మాత్రమే కంపెనీ క్యాంటీన్‌లో సుమారు రూ.1.14 లక్షలు ఖర్చు చేశానని, ఇటీవల షుగర్ లెవల్స్ తగ్గినప్పుడు రూ.186 విలువైన చాక్లెట్ కుకీ కొనుగోలు చేశానని తెలిపారు. అయితే కొద్ది రోజుల తర్వాత సూపర్‌వైజర్ తనను పిలిచి “కుకీ దొంగతనం” ఆరోపణలతో ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారని ఆయన పేర్కొన్నారు.
తాను కుకీని కొనుగోలు చేసినట్లు బిల్లు ఉన్నప్పటికీ కంపెనీ వినిపించుకోలేదని, ఫ్యాక్టరీ ప్రాంగణం నుంచి బలవంతంగా బయటకు పంపారని ఆరోపించారు. తరువాత బిల్లు స్క్రీన్‌షాట్ సమర్పించిన తర్వాత తన నిర్దోషిత్వం నిర్ధారించబడిందని, ఉద్యోగానికి తిరిగి రావాలని యూనియన్ ప్రతినిధులు ఆహ్వానించినప్పటికీ తిరిగి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఫోర్డ్ కంపెనీ వ్యవహారశైలిపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















