ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో జరిగిన విషాద ఘటన గ్రామాన్ని తీవ్రంగా కలచివేసింది. నీటి కుంటలో మునిగి నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
గ్రామానికి చెందిన కరేటి అభిరామ్ (14), కరేటి సుశాంత్ (12), పొదిలి చిన్ను (11), ఇల్లా దినేష్ (10) అనే విద్యార్థులు ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వారి కోసం గాలింపు ప్రారంభించారు.
ఈ సమయంలో నీటి కుంట వద్దకు వెళ్లిన స్థానికులు అక్కడ చిన్నారుల దుస్తులు, చెప్పులు కనిపించడంతో వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర ఆందోళన చెందారు.
ఒంగోలు తాలూకా పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకుని, స్థానికుల సహకారంతో కుంటలో గాలింపు చేపట్టారు. అప్పటికే ఎక్కువ సమయం నీటిలో ఉండటంతో నలుగురు చిన్నారులు మృతి చెందినట్లు నిర్ధారించారు.
మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండటం కుటుంబాన్ని మరింత విషాదంలో ముంచేసింది. ఈ ఘటనతో చెరువుకొమ్ముపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















