దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోలుపై లీటరుకు రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 చొప్పున ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి.
పెట్రోలియం డీలర్ల సంఘం గణాంకాల ప్రకారం గత 10 రోజుల్లోనే పెట్రోలుపై రూ.8.23, డీజిల్‌పై రూ.8.12 వరకు పెరిగాయి. ఈ నెల 15 తర్వాత ఇది నాలుగోసారి ధరల పెంపు కావడం గమనార్హం.
Rahul Gandhi కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన ధరలు పెంచుతున్నారని ఆరోపించారు. ప్రజలను విడతలవారీగా దోచుకుంటోందని విమర్శించారు.అయితే Bharatiya Janata Party ఈ ఆరోపణలను ఖండించింది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయని, ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ధరలు తక్కువగానే ఉన్నాయని పేర్కొంది.
Telangana లో రోజుకు సగటున 60 లక్షల లీటర్ల పెట్రోలు, 70 లక్షల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతోంది. తాజా పెంపుతో రాష్ట్ర ప్రజలపై వచ్చే ఏడాదికి రూ.3,877 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా.ఇంధన ధరల పెంపు ప్రభావం రైతులు, రవాణా రంగం, కూరగాయల ధరలు, నిత్యావసర వస్తువులపై కూడా పడనుంది. ట్రాక్టర్ కిరాయిలు, రవాణా ఛార్జీలు పెరగనున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government HyderabadNews India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















