K. T. Rama Rao మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 24 గంటల తాగునీటి సరఫరా అందిస్తామని ప్రకటించారు. ఈ పథకాన్ని మొదటగా Hyderabad నుంచే అమలు చేస్తామని తెలిపారు.భారాస కూకట్‌పల్లి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. గతంలో తమ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా అందించినట్లే, ఇప్పుడు నిరంతర తాగునీటి సరఫరా లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు 58, 59 జీవోల ద్వారా 2.50 లక్షల మందికి పట్టాలు ఇచ్చామని గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మం వెలుగుమట్ల, మహబూబ్‌నగర్ దివ్యాంగుల కాలనీ వంటి ప్రాంతాల్లో ఇళ్ల కూల్చివేతలు చేపట్టిందని ఆరోపించారు.
‘హైడ్రా’ పేరుతో పేదలను భయపెడుతున్నారని విమర్శించిన కేటీఆర్, ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేసే నాయకులకే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు.ఇక భద్రాచలం ఘటనపై స్పందిస్తూ.. పేదలకు కనీస గౌరవం కూడా దక్కని పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లాల్సి వచ్చిన ఘటన తెలంగాణ సమాజాన్ని కలచివేసిందన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















