హిమానీనదం బద్దలవడంతో నేపాల్‌లో ఇప్పటికే వరదలు సంభవించగా.. తాజాగా మరో ప్రమాద సూచన ఆందోళన కలిగిస్తోంది. వరదల కారణంగా కొండ ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన భారీ రాళ్లు, బురద, మంచు, ఇతర శిథిలాలు టిబెట్ ప్రాంతంలో పేరుకుపోయి ఓ సరస్సు ఏర్పడింది.
ఈ సరస్సు నీటి మట్టం, రంగులో చోటుచేసుకుంటున్న మార్పులను గమనించిన చైనా అధికారులు నేపాల్‌ను అప్రమత్తం చేశారు. ఏ సమయంలోనైనా సరస్సు గట్టు తెగిపోయి భారీగా నీరు దిగువ ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని హెచ్చరించారు.
వరదల అనంతరం ఏర్పడిన ఈ సరస్సు నీటి రంగు క్రమంగా మారుతోందని, ప్రస్తుతం ముదురు రంగులోకి మారడం ప్రమాద సంకేతంగా భావిస్తున్నామని చైనా అధికారులు తెలిపారు. ఈ సమాచారాన్ని నేపాల్ విదేశాంగ శాఖకు కూడా అందించారు.
హిమ ప్రాంతాల్లో ఏర్పడే ఇలాంటి సరస్సులు ఒక్కసారిగా ఉప్పొంగితే దిగువ ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















