ఆస్ట్రేలియాకు చెందిన ఓ జంట భారతీయ సంప్రదాయాలపై ఉన్న అభిమానంతో హిందూ పద్ధతిలో వివాహం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. విశాఖపట్నం ఈ ప్రత్యేక వివాహ వేడుకకు వేదికైంది.
శ్రీకాకుళానికి చెందిన రణసూర్య ఆస్ట్రేలియాలో జైళ్లశాఖలో పనిచేస్తున్నారు. అదే విభాగంలో పనిచేస్తున్న బ్రాడీ అనే ఆస్ట్రేలియన్‌తో ఆయనకు స్నేహం ఏర్పడింది. ఇటీవల బ్రాడీకి ఎమిలీ అనే యువతితో నిశ్చితార్థం జరిగింది.
ఈ నెల 28న విశాఖలో రణసూర్య, సృజన వివాహం జరగనున్న విషయం బ్రాడీ, ఎమిలీ తెలుసుకున్నారు. భారతీయ వివాహ సంప్రదాయాలు, ఆచారాలపై ఆసక్తి కలిగిన ఈ జంట.. అదే వేదికలో, అదే సమయంలో తమ వివాహం కూడా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.
తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా నుంచి విశాఖకు వచ్చిన బ్రాడీ, ఎమిలీ హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి వేడుకలోని ఆచారాలు, మంత్రోచ్ఛారణలు, కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు తమకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చాయని కొత్త జంట తెలిపింది.
వివిధ దేశాలు, సంస్కృతులు వేరు అయినా ప్రేమ, స్నేహం, సంప్రదాయాల పట్ల గౌరవం అందరినీ కలుపుతాయని ఈ వివాహ వేడుక మరోసారి చాటిచెప్పింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















