బంగారం, వెండి కొనాలనుకునే వారికి శుభవార్త. ఇటీవల గరిష్ఠాల వద్ద భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు వరుసగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం లాభాల స్వీకరణతో భారీగా పడిపోయిన ఈ లోహాల ధరలు, సోమవారం మరింత దిగువకు చేరాయి.
అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ఔన్సు ధర మరో 6 శాతం తగ్గి 4,538 డాలర్లకు, వెండి ఔన్సు 74 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీనికి అనుగుణంగా దేశీయ మార్కెట్‌లోనూ ధరలు తగ్గాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి
- 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.48 లక్షలు,
- వెండి ధర రూ.2.48 లక్షల వద్ద కొనసాగుతోంది.
ఇటీవల బంగారం రూ.1.80 లక్షలకు, వెండి దాదాపు రూ.4 లక్షలకు చేరిన సంగతి తెలిసిందే. ఆ గరిష్ఠ ధరలతో పోలిస్తే ప్రస్తుతం ధరలు గణనీయంగా తగ్గాయి. దీంతో బంగారం, వెండి కొనుగోలు ప్రణాళికలో ఉన్న వారికి ఇది ఊరట కలిగించే అంశంగా మారింది.
- 10 గ్రాముల బంగారం (ఏప్రిల్ కాంట్రాక్ట్) ధర రూ.1,39,446 వద్ద ఉండగా,
- కిలో వెండి (మార్చి కాంట్రాక్ట్) ధర 14.5 శాతం వరకు పడిపోయి రూ.2.27 లక్షల వద్ద ట్రేడవుతోంది.
డాలర్ బలపడటం, మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భౌగోళిక అనిశ్చితులు తగ్గే అవకాశాలు కనిపించడం వంటి కారణాల వల్ల బంగారం, వెండి ధరల్లో కరెక్షన్ వచ్చిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















