ఐటీ రంగంలో ఉద్యోగాలపై అనిశ్చితి నెలకొన్న సమయంలో అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ ఫ్రెషర్లకు శుభవార్త చెప్పింది. 2026 సంవత్సరంలో సుమారు 24 వేల నుంచి 25 వేల మంది వరకు ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు సంస్థ ప్రకటించింది.
కంపెనీ క్యాంపస్ నియామకాలను మరింత వేగవంతం చేస్తూ ప్రారంభ స్థాయి ఉద్యోగులను పెంచుకోవాలని నిర్ణయించింది. 2025 సంవత్సరంలో దాదాపు 20 వేల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకోగా, ఇప్పుడు ఆ సంఖ్యను మరింత పెంచేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఫ్రెషర్లను తీసుకోవడం ద్వారా కంపెనీ భవిష్యత్తు వృద్ధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలని యోచిస్తోంది.కాగ్నిజెంట్ సీఈఓ మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని పెంచడం ద్వారా కంపెనీ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు ఇది మంచి అవకాశంగా మారుతుందని, కొత్త ఇంజినీర్లను క్లయింట్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం చేస్తామని చెప్పారు.
కంపెనీ ఉద్యోగుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కాగ్నిజెంట్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు 3.5 లక్షలకు పైగా ఉంది. గత కొన్నేళ్లుగా సంస్థ భారీగా నియామకాలు చేపడుతోంది.
ఏఐ ప్రభావంతో కొన్ని పాత ఉద్యోగాలు తగ్గే అవకాశమున్నప్పటికీ, అదే సమయంలో కొత్త అవకాశాలు కూడా వస్తాయని కంపెనీ పేర్కొంది. ఆధునిక సాంకేతిక వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని, ఇది ఉద్యోగాలను తగ్గించేది కాదని, కొత్త ఉద్యోగాలను సృష్టించేదని సంస్థ తెలిపింది.ఇతర టెక్ కంపెనీలు ఉద్యోగులను తగ్గిస్తున్న సమయంలో కాగ్నిజెంట్ పెద్ద సంఖ్యలో నియామకాలు చేపట్టడం ఐటీ రంగానికి శుభ సంకేతంగా భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















