టీ20 వరల్డ్‌కప్ 2026లో టీమ్ఇండియా ఓపెనింగ్ స్థానం కోసం నెలలుగా సాగిన చర్చలకు నవీ ముంబయి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ ముగింపు వేసినట్టైంది. అభిషేక్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా బరిలోకి దింపడం ద్వారా టీమ్ మేనేజ్‌మెంట్ తమ ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేయగా, ఆ అవకాశాన్ని ఇషాన్ పూర్తిగా తనవైపు తిప్పుకున్నాడు. కేవలం 20 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఏడు సిక్స్‌లతో 53 పరుగులు సాధించి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన అతడి విధ్వంసకర ఇన్నింగ్స్, ఈ మెగా టోర్నీలో ఓపెనర్‌గా అతడి స్థానం మారింది. అదే సమయంలో సంజూ శాంసన్‌కు మరోసారి తుది జట్టులో చోటు దక్కకపోవడం ఈ సెలెక్షన్ నిర్ణయంలోని అసలు సారాంశాన్ని బయటపెట్టింది.
కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని మళ్లీ ఆకర్షించడమే కాకుండా, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 4 ఇన్నింగ్స్‌ల్లో 215 పరుగులు చేసి సిరీస్‌లో రెండో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు; రాయ్‌పూర్‌లో చేసిన 76 పరుగుల ఇన్నింగ్స్, తిరువనంతపురంలో కేవలం 43 బంతుల్లో సాధించిన సూపర్ సెంచరీ (103) అతడి ఫామ్‌కు బలమైన ఆధారాలుగా నిలిచాయి.

తాజాగా విడుదలైన ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 32 స్థానాలు ఎగబాకి 32వ ర్యాంక్‌కు చేరడం కూడా అతడి ఎదుగుదల ఎంత వేగంగా జరుగుతోందో చూపిస్తోంది. మరోవైపు, వరుస అవకాశాలు దక్కినా సంజూ శాంసన్ మొత్తం ఐదు టీ20ల్లో కలిపి కేవలం 46 పరుగులే చేయడంతో జట్టు అవసరాలను తీర్చలేకపోయాడనే అభిప్రాయం బలపడింది. ఈ అన్ని అంశాలను కలిపి చూస్తే, ఫిబ్రవరి 7 నుంచి భారత్–శ్రీలంక వేదికగా ప్రారంభమయ్యే పొట్టి ప్రపంచకప్‌లో సంజూ బెంచ్‌కే పరిమితమవుతాడని, ఇషాన్ కిషన్ మాత్రం టీమ్ఇండియా ప్రధాన ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని ఈ వార్మప్ మ్యాచ్ అధికారికంగా తేల్చేసినట్టుగా మారింది. ఈ మెగా టోర్నీలోనూ ఇషాన్ ఇలానే దూకుడు ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తే, టీమ్ఇండియాలో అతడి స్థానం ఇకపై ప్రశ్నాతీతంగా మారుతుందనే అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















