గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఓ బావిలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న వింత పరిణామం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీర్‌పార్థ గ్రామంలోని బావిలో నీరు భారీ అలల మాదిరిగా ఎగసిపడుతూ, అటూ ఇటూ కదులుతూ బయటకు పొంగిపొర్లుతోంది. దీంతో ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఆసక్తికరంగా మారి, బావిని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
వ్యవసాయ క్షేత్రం యజమాని ప్రాంజీవన్ సదరియా ప్రకారం.. మూడు నెలల క్రితం ఈ బావిని తవ్వారు. ఆగస్టు 2న తొలిసారి నీటిలో అసాధారణ కదలికలను గుర్తించారు. నీరు ఎగసిపడుతుండటంతో భూకంపం వచ్చే అవకాశం ఉందేమోనని గ్రామస్థులు ఆందోళన చెందారు. అయితే ఈ ప్రాంతంలో భూకంపం వచ్చే సూచనలు లేవని గాంధీనగర్‌లోని భూకంప పరిశోధనా సంస్థ స్పష్టం చేసినట్లు జిల్లా భూగర్భ శాస్త్రవేత్త జేఎస్ వధేర్ తెలిపారు.
బావిలోని రాళ్ల మధ్య నుంచి గాలి బయటకు రావడం వల్ల నీటిపై ఒత్తిడి పెరిగి అలలు ఏర్పడే అవకాశం ఉందని ఆయన వివరించారు. అసలు కారణాన్ని నిర్ధారించేందుకు భూగర్భ నిపుణుల బృందం పరిశీలన కొనసాగిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















