భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన క్రికెట్ కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని తాజాగా గుర్తుచేసుకున్నాడు. 2000లో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) నుంచి తనను బయటకు పంపడానికి అసలు కారణం ఆహార విషయంలో తాను ప్రశ్నించడమేనని వెల్లడించాడు.
ఎన్‌సీఏలో శిక్షణ పొందిన తొలి బ్యాచ్ ఆటగాళ్లలో హర్భజన్ కూడా ఉన్నాడు. ఆ సమయంలో ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా డైట్ చార్ట్ రూపొందించినప్పటికీ, దానికి అనుగుణంగా ఆహారం అందించేవారు కాదని భజ్జీ పేర్కొన్నాడు.
తాను పలుమార్లు ఈ విషయంపై ఫిర్యాదు చేసినా ఎలాంటి మార్పు కనిపించలేదని చెప్పాడు. దీంతో ఒక రోజు కోపంతో డైట్ చార్ట్‌ను చించేశానని వెల్లడించాడు. అదే తాను చేసిన ఏకైక తప్పిదమని, ఆ ఘటన తర్వాత తనను ఎన్‌సీఏ నుంచి బయటకు పంపించారని వివరించాడు.
“నేను నా హక్కుల కోసం పోరాడాను. నేను ప్రశ్నించకపోతే ఇప్పటికీ అదే డైట్ ప్లాన్ కొనసాగి ఉండేది” అని హర్భజన్ పేర్కొన్నాడు.
అప్పట్లో బీసీసీఐలో తమ నిర్ణయాలను ప్రశ్నించే వారిని సహించని కొందరు వ్యక్తులు ఉండేవారని కూడా మాజీ క్రికెటర్ వ్యాఖ్యానించాడు. అయితే తాను చేసిన ప్రశ్నల వల్ల తర్వాతి తరాల ఆటగాళ్లకు మెరుగైన సౌకర్యాలు అందే అవకాశం ఏర్పడిందని అభిప్రాయపడ్డాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















