వైద్య పరిశోధనల కోసం దానం చేసిన మృతదేహాల నుంచి శరీరభాగాలను అక్రమంగా సేకరించి బ్లాక్ మార్కెట్‌లో విక్రయించిన ఘటనపై ప్రముఖ విద్యాసంస్థ హార్వర్డ్ యూనివర్సిటీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. దానం చేసిన మృతదేహాలను భద్రంగా నిర్వహించడంలో విఫలమైందంటూ పలు కుటుంబాలు న్యాయపరమైన చర్యలు చేపట్టాయి. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ రూ.507 కోట్ల పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది.
హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో వైద్య పరిశోధనల కోసం ప్రజలు తమ మృతదేహాలను దానం చేస్తుంటారు. వీటిని భద్రపరిచే శవాగారాన్ని సెడ్రిక్ లాడ్జ్ అనే వ్యక్తి నిర్వహించేవాడు. దాదాపు మూడు దశాబ్దాలుగా అక్కడ పనిచేసిన అతడు.. దానంగా వచ్చిన మృతదేహాల నుంచి శరీర భాగాలను అక్రమంగా తొలగించి విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
దర్యాప్తు ప్రకారం.. లాడ్జ్ 2018 నుంచి దానంగా వచ్చిన మృతదేహాల నుంచి తలలు, చర్మం, చేతులు, ఇతర శరీర భాగాలను అక్రమంగా తీసుకెళ్లేవాడు. వాటిని తన ఇంటికి తరలించి, భార్య సహాయంతో ఇతరులకు విక్రయించేవాడని అధికారులు గుర్తించారు.
2023లో లాడ్జ్‌ను అరెస్టు చేశారు. అనంతరం కేసు విచారణలో అతడికి గతేడాది డిసెంబర్‌లో ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో తమ ఆత్మీయుల మృతదేహాలను విశ్వసించి దానం చేసిన కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి.
మృతదేహాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదంటూ పలు కుటుంబాలు హార్వర్డ్ యూనివర్సిటీపై దావాలు వేశాయి. ఈ న్యాయపరమైన వివాదాలను పరిష్కరించేందుకు విశ్వవిద్యాలయం ముందుకు వచ్చింది.
బోస్టన్‌లోని న్యాయస్థానం సెటిల్‌మెంట్ ప్రక్రియకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇందులో భాగంగా బాధిత కుటుంబాలకు మొత్తం రూ.507 కోట్లు చెల్లించేందుకు హార్వర్డ్ అంగీకరించింది.
ఈ ఘటనపై బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పేందుకు కూడా హార్వర్డ్ ముందుకొచ్చింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మృతదేహాల నిర్వహణ, పర్యవేక్షణలో మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. దాతల జ్ఞాపకార్థం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















