వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్ నుంచే తిరుమల కొండకు నడిచి వెళ్తుంటారు. ఇలాంటి వారు అలిపిరి నుంచి వెళ్తే 3,650 మెట్లు, శ్రీవారి మెట్టు మార్గమైతే 2,100 మెట్లు ఎక్కాలి. ఎకాఎకీన ఇన్నేసి మెట్లు ఎక్కాలంటే మానసికంగానే కాకుండా.. శారీరకంగానూ ముందస్తుగా సన్నద్ధం కావాలంటున్నారు.. వైద్యనిపుణులు. ఆరోగ్యవంతులు, రోజూ వ్యాయామం చేసేవారికి ఇబ్బందులు లేకపోయినా, శారీరక శ్రమ చేయనివారు మాత్రం ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
- అలిపిరి మెట్లమార్గం, శ్రీవారి మెట్టుమార్గం ఎంతో క్లిష్టమైనవి. ఈ మార్గాల్లో వెళ్లాలంటే రోడ్డు మీద నడిచేందుకు అవసరమైన శక్తి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అవసరం. ఊబకాయులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, గుండెపోటు, ఆస్తమా, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు, 60ఏళ్లు పైబడిన వారు మెట్ల దారి ఎంచుకుంటే.. కొన్నిరోజుల ముందు నుంచే శరీరాన్ని సన్నద్ధం చేసుకోవాలి.
- కొవిడ్ తర్వాతి పరిణామాల నేపథ్యంలో శారీరకంగా సిద్ధంగా ఉంటేనే నడకదారిని ఎంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
- దూరప్రాంతాల నుంచి వచ్చేవారిలో కొందరు ప్రయాణంతో అలసిపోతుంటారు. మళ్లీ వాళ్లు నడక దారిలో వెళ్తుంటారు. ఇలాంటివారు తప్పక విశ్రాంతి తీసుకుంటూ నెమ్మదిగా వెళ్లాలి.
- ఆరోగ్యంగా లేని వారు.. ఒక్కసారిగా ఎక్కువ మెట్లు ఎక్కితే అప్పటికప్పుడు గుండె సంబంధ సమస్యలూ బయటపడొచ్చని తిరుపతిలోని గుండె వైద్యనిపుణుడు డా.వెంకటరమణ తెలిపారు. ‘అమర్‌నాథ్ యాత్రకు వైద్యపరీక్షలు చేసుకున్న వారినే అనుమతిస్తారు. మెట్ల మార్గంలో తిరుమలకు వచ్చే భక్తులకూ గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు చేయించుకుంటే ఇబ్బందులు ఎదురుకావు’ అని వివరించారు.
ఇదిగో వైద్య సేవలు..
- తిరుమలకు నడకమార్గాల్లో వచ్చే భక్తులకు తితిదే వైద్యసేవలు అందిస్తోంది. అలిపిరి మార్గంలోని 1,500వ మెట్టు, గాలిగోపురం వద్ద శిబిరాలు ఏర్పాటు చేసింది. అలిపిరి పాదాల మండపం, ఏడో మైలు వద్ద, భాష్యకార్ల సన్నిధి వద్ద, శ్రీవారి మెట్టు మార్గంలోని 1,200వ మెట్టు వద్ద ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందిస్తారు.
- అత్యవసర సమయంలో, అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యే భక్తులకు సీపీఆర్ అందించేందుకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో తితిదే భద్రతా సిబ్బంది, పోలీసులకు శిక్షణ అందించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















