రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. శనివారం వీటితో పాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కూడా వడగాలులు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
శుక్ర, శనివారాల్లో ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40–50 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. వచ్చే నెల మూడో తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల్లో కొద్దిగా కదలికలు ప్రారంభమయ్యాయని, బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితుల కారణంగా రుతుపవనాల పురోగతికి అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
ఇదిలా ఉండగా, గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా దంచికొట్టాయి. 12 జిల్లాల్లో 46 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో 46.4 డిగ్రీలు నమోదైంది. పెద్దపల్లి జిల్లా ముత్తారం, వరంగల్ జిల్లా సంగెం ప్రాంతాల్లో 46.3 డిగ్రీలు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, ఖమ్మం జిల్లా ఏన్కూరు, కుమురం భీం జిల్లా బెజ్జూరు, నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతాల్లో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, జగిత్యాల జిల్లా యెండపల్లి, మహబూబాబాద్ జిల్లా గార్ల, సూర్యాపేట జిల్లా నాగారం, నిర్మల్ జిల్లా కేంద్రం సమీప ప్రాంతాల్లో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















