ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడిగా భావించేహోర్ముజ్ జలసంధివద్ద ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ మార్గంలో నౌకల రాకపోకలు దాదాపు స్తంభించాయి. ప్రస్తుతం 700కు పైగా ట్యాంకర్లు హోర్ముజ్‌కు అటూ ఇటూ నిలిచిపోయినట్లు అంతర్జాతీయ మారిటైమ్ విశ్లేషణ సంస్థల డేటా చెబుతోంది. వీటిలో 334 చమురు నౌకలే కావడం గమనార్హం.
చమురు రవాణా 86% తగ్గుదల
- సాధారణంగా రోజుకు సగటున 19.8 మిలియన్ బ్యారెళ్ల చమురు ఈ మార్గంలో రవాణా అవుతుంది.
- తాజాగా కేవలం 2.8 మిలియన్ బ్యారెళ్లే రవాణా కావడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.
- మార్చి 2న ఒక్క చిన్న ట్యాంకర్, ఒక కార్గోషిప్ మాత్రమే జలసంధిని దాటాయి.
ఈ పరిణామాలతో ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన అంతరాయం ఏర్పడింది.
బీమా, రవాణా ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి
- గల్ఫ్ జలాల్లో ప్రయాణించే నౌకలపై బీమా ప్రీమియంలు పెరిగాయి.
- షిప్పింగ్ కంపెనీలు అదనపు రిస్క్ ఛార్జీలు విధిస్తున్నాయి.
- రవాణా ఆలస్యాలు పెరిగితే చమురు కొరతకు దారితీసే అవకాశం ఉందని నిపుణుల హెచ్చరిక.
భారత్‌పై ప్రభావం ఎంత?
- భారత్ రోజుకు సగటున 2.5 మిలియన్ బ్యారెళ్ల చమురును ఈ మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటోంది.
- మన మొత్తం దిగుమతుల్లో దాదాపు 50% హోర్ముజ్ మార్గంపైనే ఆధారపడి ఉంది.
- ఎల్‌పీజీ అవసరాల్లో 80-85% దిగుమతులే. వాటిలో అధిక భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది.
- ప్రస్తుత నిల్వలు రెండు వారాల ఎల్‌పీజీకి, సుమారు 60 రోజుల చమురు అవసరాలకు సరిపోతాయని అంచనా.
పరిస్థితి సుదీర్ఘమైతే మాత్రమే దేశీయ ఇంధన సరఫరాపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులఅభిప్రాయం.
ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి
ఆసియా, ఐరోపా రిఫైనరీలు ఇప్పుడు
- యూఎస్ గల్ఫ్ కోస్ట్,
- పశ్చిమ ఆఫ్రికా,
- బ్రెజిల్,
- రష్యా
వంటి ప్రాంతాల నుంచి సరఫరా పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే భారత్, చైనా ఇంకా హోర్ముజ్ మార్గంపైనే అధికంగా ఆధారపడుతున్నాయి.
భగ్గుమంటున్న అంతర్జాతీయ ధరలు
- బ్రెంట్ క్రూడ్ ధర వరుసగా పెరిగి 80 డాలర్ల దాకా చేరింది.
- యూరోపియన్ గ్యాస్ ధర 40% పైగా పెరిగింది.
- సౌదీ అరేబియాలోని రాస్ తనురా రిఫైనరీపై దాడి కూడా ధరల పెరుగుదలకు కారణమైంది.
కేంద్రం అప్రమత్తం
ప్రస్తుత పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















