హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రవ్యాప్తంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. జూన్ 30 నుంచి ఆగస్టు 9 వరకు వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 157 మంది మృతిచెందగా.. 257 మంది గల్లంతయ్యారు.
వరదలు, కొండచరియలు విరిగిపడటం తదితర కారణాలతో 68 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 89 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా సుమారు 900 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు దెబ్బతిన్నాయి. మొత్తం రూ.886 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం వెల్లడించింది.
విద్యుత్, రహదారులకు తీవ్ర నష్టం :
భారీ వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కుల్లు, మండి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సుమారు 161 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు వారం రోజులుగా పనిచేయడం లేదు. మండిలో 77, సిమ్లాలో 43, కుల్లులో 40 డీటీఆర్‌లు దెబ్బతిన్నాయి.
కొండచరియలు విరిగిపడటం, భూమి కుంగిపోవడం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 259 రహదారులు ధ్వంసమయ్యాయి. మండిలో 120, చంబాలో 42, కుల్లులో 40, సిమ్లాలో 30 రహదారులు దెబ్బతిన్నాయి. రహదారుల పునరుద్ధరణకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినా.. వర్షాల కారణంగా పనులకు ఆటంకం ఎదురవుతోంది.
తాగునీటి సరఫరాపైనా వర్షాల ప్రభావం పడింది. రాష్ట్రవ్యాప్తంగా 54 నీటి సరఫరా పథకాలు ప్రభావితమైనట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ :
మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌కు వర్ష ముప్పు ఇంకా కొనసాగుతోంది. కాంగ్రా, మండి, హమీర్‌పూర్, సిమ్లా, సిర్మౌర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సిమ్లా ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
అలాగే చంబా, కుల్లు, సోలన్, బిలాస్‌పూర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















