తమిళనాడులో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన టీవీకే పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతుండడంతో ఆ పార్టీ అధినేత, ప్రముఖ నటుడు విజయ్‌కు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు ఆయన విజయం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
నటుడు నాని ఈ విజయాన్ని సినిమాను తలపించేలా ఉందని వ్యాఖ్యానించారు. ప్రారంభంలో అనుమానాలు ఉన్నప్పటికీ ప్రజలు విజయ్‌కు మద్దతుగా నిలిచారని తెలిపారు. ఈ ఫలితాలు అంచనాలను తలకిందులు చేశాయని చెప్పారు.
వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, మార్పు కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. జీవి ప్రకాశ్ కుమార్ ఈ గెలుపును చారిత్రాత్మకమని అభివర్ణించారు. టైగర్ ష్రాఫ్ విజయ్‌పై ప్రజల విశ్వాసం గొప్పదని కొనియాడగా, నిఖిల్ భారతీయ సినిమాకు గర్వకారణమైన విజయమని అభినందించారు.మొత్తంగా, విజయ్ విజయం రాజకీయాల్లో కొత్త మార్పుకు సంకేతమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNews TrendingNow ViralNews WorldNews



















