హైదరాబాద్ వనస్థలిపురంలో పాల వ్యాపారిపై కత్తితో దాడి ఘటన కలకలం రేపింది. ఎన్జీవోస్ కాలనీ బస్టాండ్ సమీపంలో పాల వ్యాపారి భుజంగరావు (60) బైక్‌పై వెళ్తుండగా శివేందర్‌సింగ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో భుజంగరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఎన్జీవోస్ కాలనీలో భుజంగరావు పాల వ్యాపారం నిర్వహిస్తుండగా.. శివేందర్‌సింగ్ స్టేషనరీ షాపు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శివేందర్‌సింగ్ కత్తితో దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటన అనంతరం నిందితుడు వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















