హాకీ ప్రపంచకప్ 2026కు ముందు భారత పురుషుల, మహిళల జాతీయ జట్ల జెర్సీ రంగు మార్పు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భారత క్రీడా జట్లకు నీలం రంగు జెర్సీతో ఉన్న ప్రత్యేక గుర్తింపు కనిపిస్తుంటుంది. అయితే ఈసారి ప్రపంచకప్‌లో భారత హాకీ జట్లు కాషాయ రంగు జెర్సీలతో బరిలోకి దిగనున్నాయి.
ఈ మార్పుపై పలువురు మాజీ క్రీడాకారులు, అభిమానుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. జెర్సీ రంగును కాషాయంగా మార్చడంపై రాజకీయ విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే ఈ ఆరోపణలను హాకీ ఇండియా ఖండించింది.
జెర్సీ రంగు మార్పు వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ హాకీ పోటీలు జరిగే మైదానాల్లో నీలి రంగు సింథటిక్ పిచ్‌లు ఉండటంతో, అదే రంగు జెర్సీలు ధరించినప్పుడు ఆటగాళ్లు స్పష్టంగా కనిపించడంలో ఇబ్బంది ఎదురవుతోందని వివరించింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు, కోచ్‌లతో చర్చించిన తర్వాత ప్రత్యామ్నాయ రంగును ఎంపిక చేసినట్లు తెలిపింది.
జాతీయ జెండాలోని ముఖ్యమైన రంగుల్లో ఒకటైన కాషాయాన్ని ఎంపిక చేయడం సాంకేతికంగా కూడా సరైన నిర్ణయంగా భావించినట్లు హాకీ ఇండియా పేర్కొంది. కాషాయం ధైర్యం, త్యాగం, జాతీయ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపింది.
ఇదిలా ఉండగా, హాకీ ప్రపంచకప్ ఆగస్టు 15 నుంచి 30 వరకు నెదర్లాండ్స్, బెల్జియం దేశాల వేదికగా జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత జట్లు కొత్త రంగు జెర్సీలతో బరిలోకి దిగనున్న నేపథ్యంలో.. జట్టు ప్రదర్శనతో పాటు ఈ కొత్త జెర్సీ కూడా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















