హైదరాబాద్‌లో మరో భారీ లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనున్నారు. కోకాపేటలోని గోల్డెన్ మైల్ రోడ్డులో ట్రంప్ టవర్స్ నిర్మించనున్నారు. ట్రంప్ ఆర్గనైజేషన్, ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నాయి.
ఈ ప్రాజెక్ట్‌లో రెండు టవర్లను నిర్మించనున్నారు. ఒక్కో టవర్‌లో 65 అంతస్తులు ఉండగా.. మొత్తం 450 అత్యాధునిక లగ్జరీ ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. టవర్ల ఎత్తు సుమారు 240 మీటర్లు ఉండనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు రెరా అనుమతులు లభించినట్లు సంస్థలు వెల్లడించాయి.
నిర్మాణం పూర్తయితే ఇవి దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన టవర్లలో ఒకటిగా, అలాగే భారత్‌లోనే అత్యంత ఎత్తైన ట్రంప్ టవర్స్‌గా నిలిచే అవకాశం ఉంది. త్వరలో నిర్వహించనున్న భూమిపూజ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులు హాజరయ్యే అవకాశం ఉంది.
రూ.4,200 కోట్ల వరకు ఆదాయం అంచనా:
ట్రిబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేశ్ మెహతా వెల్లడించిన వివరాల ప్రకారం.. భూమి ఖర్చును మినహాయిస్తే ప్రాజెక్ట్ నిర్మాణానికి సుమారు రూ.1,700–1,800 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఫ్లాట్ల విక్రయాల ద్వారా రూ.3,500 కోట్ల నుంచి రూ.4,200 కోట్ల వరకు ఆదాయం రావచ్చని తెలిపారు.
ఈ లగ్జరీ అపార్ట్‌మెంట్లలో ఒక్కో ఫ్లాట్ ధర సుమారు రూ.5 కోట్ల నుంచి ప్రారంభం కానుంది. ప్రాజెక్ట్‌లో 16 పెంట్‌హౌస్‌లు ఉండగా.. ఇప్పటికే 8 పెంట్‌హౌస్‌లు విక్రయమైనట్లు సంస్థ తెలిపింది. వీటిలో ఒక పెంట్‌హౌస్ గరిష్ఠంగా రూ.62 కోట్లకు విక్రయించినట్లు కల్పేశ్ మెహతా వెల్లడించారు.
దక్షిణ భారతంలో తొలి ప్రాజెక్ట్ :
ముంబయికి చెందిన ట్రిబెకా డెవలపర్స్ భారత్‌లో ట్రంప్ బ్రాండ్‌కు దేశీయ ప్రతినిధిగా వ్యవహరిస్తోంది. దేశవ్యాప్తంగా ట్రంప్ పేరుతో ఇప్పటికే 8 ప్రాజెక్టులను ప్రకటించగా.. పుణె, ముంబయి, కోల్‌కతా, గురుగ్రామ్‌లలో నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేసింది.
దక్షిణ భారతంలో తొలిసారిగా హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్‌ను నిర్మించనున్నారు. హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ చేపట్టాలనే తమ ప్రయత్నం ఇప్పుడు కార్యరూపం దాల్చిందని కల్పేశ్ మెహతా తెలిపారు. నిర్మాణాన్ని సుమారు మూడేళ్లలో పూర్తి చేయాలని సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















