ఐఐటీ బాంబే పవయీ క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో హాస్టల్ గదుల్లో భద్రతా చర్యలను పెంచే దిశగా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. గదుల్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్లను తొలగించి వాటి స్థానంలో వాల్ మౌంటెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించింది.
ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విద్యార్థి సాహిల్ రవీంద్ర వకోడే ఇటీవల పరీక్ష సందర్భంగా సెల్‌ఫోన్ వినియోగించినట్లు అధికారులు తెలిపారు. ప్రశ్నపత్రాన్ని చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేస్తుండగా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ ఘటన అనంతరం విద్యార్థి హాస్టల్ గదిలో మృతిచెందడం క్యాంపస్‌లో ఆందోళనకు కారణమైంది.
ఈ ఘటనపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్‌ను డీన్ పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రొఫెసర్ తప్పుచేశారని తాము భావించడం లేదని విద్యార్థి ప్రతినిధులు తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆయన్ను ఆ బాధ్యతల నుంచి పక్కనపెట్టాలని మాత్రమే కోరినట్లు చెప్పారు.
మరోవైపు ఐఐటీ బాంబే ఫ్యాకల్టీ ఫోరం ప్రొఫెసర్‌కు మద్దతు తెలిపింది. ఇన్విజిలేటర్‌గా ఆయన తన విధులను నిర్వర్తించారని పేర్కొంది. విద్యార్థి మృతి ఘటనకు సంబంధించి వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
పరీక్ష హాల్లో జరిగిన పరిణామాలను తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీని దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. ఫుటేజీలో ఇన్విజిలేటర్ విద్యార్థిని ప్రశ్నిస్తున్న దృశ్యాలు కనిపించినట్లు సమాచారం. అనంతరం విద్యార్థి పరీక్ష హాలు నుంచి బయటకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను తెలుసుకునేందుకు క్యాంపస్, హాస్టల్ పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలను ముంబయి క్రైమ్ బ్రాంచ్ అధికారులు విశ్లేషిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















